డబుల్‌ సెంచరీతో షురూ- ఐటీ జోరు!

డబుల్‌ సెంచరీతో షురూ- ఐటీ జోరు!

మంగళవారం అమెరికా మార్కెట్లు పతనమైనప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. డాలరు బలాన్ని పుంజుకున్న నేపథ్యంలోనూ ఆసియా మార్కెట్లు లాభపడటంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. ఆపై కాస్త వెనకడుగు వేసి ప్రస్తుతం 121 పాయింట్ల లాభంతో 33,825కు చేరింది. నిఫ్టీ సైతం 32 పాయింట్లు ఎగసి 10,392 వద్ద ట్రేడవుతోంది. తొలుత 10,425 వరకూ ఎగసింది.
ఐటీ, రియల్టీ ఓకే
రూపాయి 3 నెలల కనిష్టాన్ని తాకడంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగం అత్యధికంగా 1 శాతం జంప్‌చేయగా.. అర్బన్‌ హౌసింగ్‌ ఫండ్‌ కారణంగా రియల్టీ 0.6 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, అంబుజా, లుపిన్‌, జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ, ఐషర్‌, యూపీఎల్‌ 2-1 శాతం మధ్య బలపడ్డాయి. అయితే బజాజ్‌ ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌ 1.2-0.4 శాతం మధ్య నీరసించాయి.Most Popular