మిందా ఇండస్ట్రీస్ ఫలితాల్లో జోష్ !

మిందా ఇండస్ట్రీస్ ఫలితాల్లో జోష్ !

ప్రముఖ ఆటో యాన్సిలరీ సంస్థ మిందా ఇండస్ట్రీస్ ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మూడో క్వార్టర్లో సంస్థ ఆదాయం 15.5 శాతం వృద్ధితో రూ.1056.16 కోట్లుగా నమోదైంది. 

ఎబిటా 27.2 శాతం పెరిగి రూ.126.38 కోట్లుగా ఉంది. మార్జిన్లలో 1.07 శాతం వృద్ధి నమోదైంది. నిరుటితో పోలిస్తే పన్నుకు ముందు లాభం (ప్యాట్) రూ.66.1 కోట్లుగా ఉంది. వడ్డీ రేట్లు కొద్దిగా తగ్గడం ఇందుకు దోహదపడింది. 

రూ.2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేర్‌పై 60 శాతం (రూ.1.20) మధ్యంతర డివిడెండ్‌ను బోర్డ్ ఆమోదించింది. మార్చి 14, 2018 కంటే ముందుగా ఈ చెల్లింపులు పూర్తవుతాయి. 

స్విచింగ్ గేర్స్, అలాయ్ వీల్స్‌ను ప్రముఖ సంస్థలకు సరఫరా చేసే వ్యాపారంలో చాలా కాలం నుంచి ఉంది మిందా ఇండస్ట్రీస్. 

Minda Industries 1182.20 75.90 (+6.86%)Most Popular