మార్కెట్‌లో కోటీశ్వరుడిగా మారేందుకు వారెన్ బఫెట్‌ చెప్పే సీక్రెట్స్!

మార్కెట్‌లో కోటీశ్వరుడిగా మారేందుకు వారెన్ బఫెట్‌ చెప్పే సీక్రెట్స్!

దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా సుదీర్ఘమైన ర్యాలీ చేసిన అనంతరం.. ప్రస్తుతం కూల్ఆఫ్ అవుతున్నాయి. హైయర్ లెవెల్స్‌తో పోల్చితే అన్ని మార్కెట్లు కనీసం 6 శాతం కరెక్షన్‌కు గురి అయ్యాయి. బాండ్ ఈల్డ్స్ పెరగడంతో.. ఇన్‌ఫ్లేషన్ భయాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఆందోళనకు గురి చేశాయి. 

అమెరికాలో వడ్డీ రేట్లు పెరగనున్నాయన్న సూచనలు, ఇన్‌ఫ్లేషన్ భయాలు, అధిక బాండ్ ఈల్డ్స్.. మార్కెట్లలో కుదుపునకు కారణంగా చెప్పవచ్చు. అయితే గ్లోబల్ సెల్ఆఫ్ కారణంగా దేశీయ మార్కెట్లలో వచ్చిన కరెక్షన్‌ను.. కొనుగోళ్లకు అవకాశం ఇండియన్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ భావిస్తోంది. ఎంపిక చేసిన స్టాక్స్‌లో కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రస్తుత లెవెల్స్ అనుకూలంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. 

 

బఫెట్ సూత్రాలు
ఇలాంటి దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పిన మంత్రాలను కొన్నింటిని గుర్తు చేసుకోవాలి. పెట్టుబడులు చేసిన అనంతరం లాంగ్‌టెర్మ్ వెయిట్ చేయడం.. మార్కెట్లలో సంభవించే షార్ట్‌టెర్మ్ ఒడిదుడుకుల నుంచి దూరంగా ఉండడాన్ని సూచించారు బఫెట్. 
తక్కువ స్థాయిలలో స్టాక్స్‌లో పెట్టుబడులు చేసి సుదీర్ఘకాలం వేచి ఉండాలన్నది వారెన్ బఫెట్ చేసిన సూచనల్లో ప్రధానమైనది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం స్థిరంగానే కనిపిస్తోంది. షార్ట్-టెర్మ్ ఓలటాలిటీ కారణంగా వచ్చిన కరెక్షన్‌ను చీపర్ లెవెల్స్‌లో స్టాక్స్‌లో పెట్టుబడులకు అనుకూలంగా భావించవచ్చు. భారత ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు కూడా సుదీర్ఘకాలంలో మార్కెట్లకు మేలు చేయనున్నాయి.

 

మళ్లీ 2008 ఛాయలు కనిపిస్తున్నాయా?
2008 ఆర్థిక సంక్షోభం సమయంలో మార్కెట్లు ఎలా పతనం అయ్యాయో ఇన్వెస్టర్ సమాజానికి బాగానే తెలుసు. 2011లో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం కూడా నెలకొందన్న అంచనాలు ఉన్నాయి. అయితే, చారిత్రకంగా పరిశీలిస్తే ప్రతీ కరెక్షన్ తర్వాత, మార్కెట్లు గణనీయంగా ఊపందుకోగలిగాయి. అందుకే ఇలాంటి సమయంలో వారెన్ బఫెట్ మంత్రాలను గుర్తు చేసుకోవాలి.
దీర్ఘకాలం పెట్టుబడులు చేసేందుకు ఇది అనుకూల సమయంగా గుర్తించి పెట్టుబడులు చేసి, మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అయితే, మార్కెట్లు ఇంకా పతనం అయితే మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను ఒకసారి చెక్ చేసుకుని.. రీబ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు.

 

బుల్ మార్కెట్ తర్వాత
భారతీయ మార్కెట్లు ఏడాదికి పైగా సుదీర్ఘమైన ర్యాలీ చేశాయి. ఆదాయాలు రికవర్ కావడం, ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా కనిపించడం, ఐపీఓల హంగామా వంటివి ఇందుకు సహకరించాయి. కానీ పతనాల్లోనే వారెన్ బఫెట్ చెప్పిన వాల్యూ ఇన్వెస్టింగ్‌ను గుర్తు చేసుకోవాలి. 
మార్కెట్లలో సుదీర్ఘకాలం వెయిట్ చేయడం.. పెట్టుబడుల విషయంలో ప్రాథమిక సూత్రం. అందుకే షార్ట్‌టెర్మ్ గోల్స్‌తో కాకుండా సుదీర్ఘ  ప్రణాళికలతో మార్కెట్లలో పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారతీయ మార్కెట్లలో ఇవి అద్భుతమైన రాబడులు అందించాయి.


నాణ్యమైన కంపెనీలకు చెందిన షేర్లు డౌన్‌ట్రెండ్ కారణంగా పతనం అయినపుడు.. వీటిలో పెట్టుబడులు చేయడం ద్వారా కొన్ని రెట్ల రాబడులను పొందే అవకాశం ఉంటుంది. ఇవే మల్టీ బ్యాగర్స్‌గా మారి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచుతాయి.
కరెక్షన్ వచ్చిన ప్రతీ సారి.. కొనుగోలుకు అవకాశంగా భావించాల్సి ఉంటుంది. దీని ద్వారా పెట్టుబడి సగటు ధరను తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది. లాభదాయకత పెరిగేందుకు ఇది తోడ్పాటు అందిస్తుంది. 
 Most Popular