పతనంలో పట్టుకున్నా 49 శాతం పెరిగే  స్టాక్స్ ఇవే..  

పతనంలో పట్టుకున్నా 49 శాతం పెరిగే  స్టాక్స్ ఇవే..  

మార్కెట్లు ప్రస్తుతం బేరిష్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. ఇక్కడ బేర్స్ మార్కెట్స్ ను శాసిస్తాయి. గత సంవత్సర కాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగిన మార్కెట్లు ప్రస్తుతం బేర్ మంటున్నాయి. బేర్స్ పట్టు బిగించే కొద్ది పోర్ట్ ఫోలియోల్లో సొమ్ము ఆవిరిఅవడం ఖాయం. బడ్జెట్ ముహూర్తంగా మొదలైన కరెక్షన్ ఫలితంగా నిఫ్టీ సూచీ 5 శాతం డౌన్ కాగా, అంతకు రెట్టింపుగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 10 శాతం నష్టపోయింది. అంతే కాదు అంతర్జాతీయంగా సైతం మార్కెట్లు ప్రతికూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ బాండ్ యీల్డ్స్ కు డిమాండ్ పెరగడంతో ఈక్విటీ మార్కెట్ల నిధులు బాండ్ మార్కెట్లోకి ప్రవహిస్తున్నాయి. దీంతో మార్కెట్లు భవిష్యత్తులో మరింత పతనానికి లోనయ్యే ఆస్కారం ఉంది. 

అయితే ఈ పతనంలో పలు వ్యాల్యూ స్టాక్స్ కరెక్షన్ కు గురై అందుబాటులోకి వచ్చాయి. ఈ కరెక్షన లో మంచి  వ్యాల్యూ ఉన్న కొన్ని స్టాక్స్ 52 వారాల గరిష్టస్థాయి నుంచి సుమారు 15 శాతం వరకూ పతనానికి గురయ్యాయి. అలాంటి టాప్ టెన్ స్టాక్స్ భవిష్యత్తులో చక్కగా 49 శాతం వరకూ పెరిగే ఛాన్స్ ఉందని ప్రఖ్యాత సెక్యూరిటీ ఏజెన్సీ మోతీ లాల్ ఓస్వాల్ సిఫార్సు చేస్తున్నాయి.

మోతీలాల్ ఓస్వాల్ సిఫార్సు చేసిన పది స్టాక్స్ ...
హావెల్స్, ఇమామీ, జెఎస్‌పీఎల్, ఐజీఎల్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఎక్సైడ్, ఒబరాయ్ రియాల్టీ, రెప్కో హోం ఫైనాన్స్, ఎంసీఎక్స్, టీమ్ లీజ్

లార్జ్ క్యాప్ సిఫార్సులు :

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, మదర్సన్ సుమి, టైటాన్ , హెచ్‌పీసీఎల్, ఎన్ఎండీసీ  

 Most Popular