1000 స్టాక్స్ కు చావుదెబ్బ కొట్టిన కరెక్షన్ !

1000 స్టాక్స్ కు చావుదెబ్బ కొట్టిన కరెక్షన్ !

ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ! మార్కెట్లో తల పండిన విశ్లేషకులు చెప్పేమాట ఇది.. నిజమే గత సంవత్సర కాలంగా ఉరకలెత్తిన మార్కెట్ కు షాక్ ట్రీట్ మెంట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అదే ట్రెండ్ మార్కెట్లోని నష్టధోరణి అలారంను మోగిస్తోంది. 

సాధారణంగా ఏదైన స్టాక్ ను అంచనా వేసేటప్పుడు దాని రోజువారి మూవింగ్ యావరేజీని ద్వారా లెక్కగడతారు. లాంగ్ టర్మ్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నప్పుడు ఆ స్టాక్ 200 రోజుల డే మూవింగ్ యావరేజి (డీఎంఏ)ను లెక్కగట్టి దాని గ్రాఫ్ కదలికల్ని అంచనా వేస్తారు. అలాగే 50 రోజుల డీఎంఏను సైతం లెక్కగడతారు. ప్రస్తుతం మార్కెట్లో మొదలైన బేరిష్ ట్రెండ్ ఫలితంగా బీఎస్ఈలోని సుమారు 1000 స్టాక్స్ కు సంబంధించిన 200 రోజుల మూవింగ్ యావరేజీ కన్నా, వాటి 50 రోజుల మూవింగ్ యావరేజి తక్కువగా నమోదు అయ్యింది. దీనినే  డెత్ క్రాస్ అంటారు. అంటే 200 డిఎంఏ కన్నా 50 డిఎంఏ దానికి దిగువన ఉండడటమే డెత్‌ క్రాస్‌. దీనర్థం బేరిష్‌ ట్రెండ్‌ యధాతథంగా ఉందనడానికి సంకేతం. 

బీఎస్ఈలోని సుమారు 1000 స్టాక్స్ డెత్ క్రాస్ కు గురయ్యాయి. ఇందులో ఐషర్ మోటార్స్, బాష్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్, శ్రీరాం సిటీ యూనియన్, బీఈఎంఎల్, పీవీఆర్, పీఎన్బీ హౌసింగ్, లుపిన్, అరబిందో ఫార్మా లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయి. 

ఉదాహరణకు ఫిబ్రవరి 9 మార్కెట్ ముగిసే నాటికి ఐషర్ మోటార్స్ 200 డీఎంఏ  29,558గా ఉంటే దాని  50 రోజుల మూవింగ్ యావరేజీ (డీఎంఏ)  అంతకన్నా తక్కువ 28,636గా ఉంది. బేరిష్ ట్రెండ్ లో ట్రేడర్లు ఈ డెత్ క్రాస్ సూచీని పరిగణలోకి తీసుకొని మంచి స్టాక్స్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో డెత్ క్రాస్ కు వ్యతిరేకంగా గోల్డెన్ క్రాస్ ఉంటుంది. అంటే ఇది పూర్తిగా బుల్లిష్ ట్రెండ్ ను ప్రతిబింబిస్తుంది. ఏది ఏమైన బేరిష్ మార్కెట్లో స్టాక్స్ ఎంపిక అనేది జాగ్రత్తగా ఉండాలి. 

 Most Popular