ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ షేరు కెవ్వు కేక!

ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ షేరు కెవ్వు కేక!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ కౌంటర్‌ ర్యాలీ బాటలో సాగుతోంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 1495 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1542 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. జనవరి18న ఫలితాలు ప్రకటించాక ఈ షేరు 56 శాతం జంప్‌చేయడం విశేషం! 
క్యూ3 స్ట్రాంగ్‌
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ  నికర లాభం 16 శాతం ఎగసి రూ. 126 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం పెరిగి రూ. 969 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 126 కోట్లను తాకింది. టర్నోవర్లో ఉత్తర అమెరికా వాటా దాదాపు 59 శాతంకాగా.. యూరోపియన్‌ మార్కెట్లు, ఇండియా వాటా 12 శాతం స్థాయిలో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.Most Popular