ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌ భల్లేభల్లే

ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌ భల్లేభల్లే

ఆరు త్రైమాసికాల తరువాత టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించడంతో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 6.2 శాతం జంప్‌చేసి రూ. 45 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 48 వరకూ ఎగసింది.
క్యూ3 భేష్‌
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 82 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ. 37 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా పెరిగి రూ. 1091 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 18 శాతం ఎగసి రూ. 275 కోట్లయ్యింది.Most Popular