సెన్సెక్స్‌ 330 పాయింట్లు జూమ్‌!

సెన్సెక్స్‌ 330 పాయింట్లు జూమ్‌!

మిడ్‌ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు మరింత పెరగడంతో మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 330 పాయింట్లు పురోగమించి 34,336కు చేరగా... నిఫ్టీ 95 పాయింట్లు జంప్‌చేసి 10,550ను తాకింది. ఎన్‌ఎస్ఈలో ఐటీ స్వల్ప వెనకడుగువేయగా.. ఫార్మా, రియల్టీ, ఆటో, మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. 
బ్లూచిప్స్‌ జోరు
నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, అరబిందో, యస్‌బ్యాంక్‌, లుపిన్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, ఐబీ హౌసింగ్‌, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, మారుతీ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టెక్ మహీంద్రా 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.Most Popular