సెల్ఆఫ్ తర్వాత చక్కటి లాభాలు ఇవ్వగల 10 మిడ్‌క్యాప్స్!!

సెల్ఆఫ్ తర్వాత చక్కటి లాభాలు ఇవ్వగల 10 మిడ్‌క్యాప్స్!!

తాజాగా మార్కెట్లు సెల్ఆఫ్‌కు గురి కావడం, మిడ్‌క్యాప్ షేర్లలో భారీ అమ్మకాలు జరగడం ఇన్వెస్టర్లను భయపెట్టింది. అనేక స్టాక్స్ తాజా గరిష్టాల నుంచి 10-15 శాతం మేర పతనం అయ్యాయి. ఇలాంటి సమయంలో చవగ్గా లభించే షేర్లను మదుపర్లు వెతకడం సహజం.
లార్జ్‌క్యాప్ కౌంటర్లతో పోల్చితే, అనేక మిడ్‌క్యాఫ్ షేర్లు భారీ ప్రీమియంతో ట్రేడింగ్ జరుపుకోవడం చూశాం. రీసెంట్ ఫాల్ కారణంగా అనేక షేర్లు ఆల్‌టైం హై లెవెల్స్ నుంచి దిగి వచ్చాయి. 


మీకు రిస్క్ తీసుకోగల సామర్ధ్యం ఉంటే పలు ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్ మీ కోసం సిద్ధఁగా ఉన్నాయి. కొన్ని మిడ్‌క్యాప్ షేర్లు ఇప్పుడు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంటోంది. 
నిజాయితీ గల ప్రమోటర్లు నిర్వహిస్తున్న మిడ్‌క్యాప్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వీటి వాల్యుయేషన్స్ అనుకూలంగా మారాయని అంటున్నారు. 


జనవరి 29న సెన్సెక్స్ ఆల్‌టైం హై లెవెల్‌ను చేరుకోగా.. జనవరి9నే రికార్డు గరిష్టాన్ని అందుకున్న మిడ్‌క్యాప్ ఇండెక్స్.. సెన్సెక్స్ రికార్డు సమయానికి 8 శాతం దిగి వచ్చింది. అదాని పవర్(27 శాతం పతనం), రిలయన్స్ పవర్ (22 శాతం పతనం), రిలయన్స్ ఇన్‌ఫ్రా ( 21 శాతం పతనం), ఇమామి ( 18 శాతం పతనం), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (18 శాతం పతనం), బేయర్ క్రాప్‌సైన్సెస్ (16 శాతం పతనం) బాగా కరెక్షన్‌కు గురి అయ్యాయి. 


ఇలాంటి సమయాల్లో మిడ్‌క్యాప్స్‌ను ఎంచుకోవడం తక్కువ ఛాలెంజ్‌తో కూడుకున్న విషయంగా మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ చెబుతోంది. మార్కెట్లలో ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నా, తాజా పతనం స్థాయిలను చూస్తే ఇప్పుడు మంచి స్టాక్స్‌ను కొనుగోలు చేయడానికి బయింగ్ ఆపర్చునటీగా చెబుతున్నారు. 

52 వారాల గరిష్ట స్థాయి నుంచి కనీసం 15 శాతం పతనం అయిన కొన్ని స్టాక్స్.. త్వరలోనే మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని మోతీలాల్ ఓస్వాల్ చెబుతోంది. రాబోయే కాలంలో 50 శాతంపైగా పెరిగే అవకాశం ఉన్న స్టాక్స్ జాబితాను అందించింది.  Most Popular