జోరుగా హుషారుగా యూరప్‌ మార్కెట్లు!

జోరుగా హుషారుగా యూరప్‌ మార్కెట్లు!

వరుస పతనాల తరువాత ఒక్కసారిగా మెరుగుపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో యూరోపియన్ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 1.3 శాతం పుంజుకోగా.. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 1.6 శాతం ఎగసింది. ఇక  జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ మరింత అధికంగా 2.1 శాతం జంప్‌చేసింది. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలకు బ్రేక్‌ వేస్తూ 1.5 శాతం లాభాలతో ముగియగా.. ఆసియాలోనూ దాదాపు అన్ని మార్కెట్లూ బలపడ్డాయి. పబ్లిక్ హాలిడే సందర్భంగా జపాన్‌ మార్కెట్‌ పనిచేయకపోగా..  కొరియా, చైనా, తైవాన్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, సింగపూర్‌ 1-0.2 శాతం మధ్య పెరిగాయి. హాంకాంగ్‌ మాత్రమే అదికూడా స్వల్పంగా 0.15 శాతం నష్టపోయింది.Most Popular