జువారీ ఆగ్రోకెమికల్స్‌ హైజంప్‌

జువారీ ఆగ్రోకెమికల్స్‌ హైజంప్‌

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో జువారీ ఆగ్రోకెమికల్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఊపందుకుంది. ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 8.5 శాతం దూసుకెళ్లి రూ. 535 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 552 వరకూ ఎగసింది. 
క్యూ3 స్ట్రాంగ్‌
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో జువారీ ఆగ్రో నికర లాభం ఏకంగా 1016 శాతం దూసుకెళ్లి రూ. 48 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 46 శాతం పెరిగి రూ. 1434 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 126 కోట్లను తాకింది.Most Popular