రియల్టీ, ఫార్మా 2% ప్లస్‌- మార్కెట్లు అప్‌!

రియల్టీ, ఫార్మా 2% ప్లస్‌- మార్కెట్లు అప్‌!

అటు అమెరికా.. ఇటు ఆసియా మార్కెట్లు లాభపడటంతో దేశీయంగానూ జోష్‌వచ్చింది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ నాటౌట్‌ అన్నట్లుగా కదులుతోంది. ప్రస్తుతం 211 పాయింట్లు జంప్‌చేసి 34,217 వద్దకు చేరగా.. నిఫ్టీ 60 పాయింట్లు ఎగసి 10,515 వద్ద ట్రేడవుతోంది.
ఐటీ వెనకడుగు
ఎన్‌ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా.. రియల్టీ, ఫార్మా 2 శాతం చొప్పున పెరిగాయి. మెటల్‌, ఆటో సైతం 1 శాతం స్థాయిలో బలపడగా.. ఐటీ స్వల్పంగా 0.3 శాతం నీరసించింది.
డెరివేటివ్స్‌ తీరిదీ
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడీబీఐ 8 శాతం జంప్‌చేయగా.. బీవోబీ, బీఈఎంఎల్‌, జస్ట్‌డయల్‌, అమరరాజా, కేన్‌ఫిన్‌, మహానగర్‌ గ్యాస్, ఇండియన్‌ బ్యాంక్‌, మారికో, టాటా స్టీల్‌ 7-4.5 శాతం మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఫోర్టిస్‌, హెచ్‌పీసీఎల్‌, టొరంట్‌ ఫార్మా, కజారియా 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.Most Popular