కైటెక్స్ గార్మెంట్స్‌కు ఫలితాల షాక్‌

కైటెక్స్ గార్మెంట్స్‌కు ఫలితాల షాక్‌

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో టెక్స్‌టైల్స్‌ సంస్థ కైటెక్స్‌ గార్మెంట్స్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 14 శాతంపైగా పతనమై రూ. 250 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 245 దిగువకు సైతం చేరింది.
క్యూ3 వీక్‌
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కైటెక్స్‌ గార్మెంట్స్‌ నికర లాభం 45 శాతం పతనమై రూ. 17.6 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా 3 శాతం పెరిగి రూ. 147 కోట్లను తాకింది. Most Popular