క్యూ3-ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌కు కిక్‌

క్యూ3-ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌కు కిక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సాధించిన ప్రోత్సాహకర ఫలితాలతో సింథటిక్‌ రబ్బర్‌ తయారీ సంస్థ ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 17.4 శాతం జంప్‌చేసి రూ. 545 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 557 వరకూ ఎగసింది.
క్యూ3 భేష్‌
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 13 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం పుంజుకుని రూ. 138 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.4 శాతం నుంచి 12.6 శాతానికి ఎగశాయి. Most Popular