మార్కెట్ల బాటలో చిన్న షేర్ల దూకుడు!

మార్కెట్ల బాటలో చిన్న షేర్ల దూకుడు!

చెప్పుకోదగ్గ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు పటిష్టంగా కదులుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే జోరందుకున్న సెన్సెక్స్‌ ప్రస్తుతం 223 పాయింట్లు పురోగమించి 34,229కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 10,518 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటు కారణంగా చిన్న షేర్లూ ఊపందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం స్థాయిలో ఎగశాయి.
లాభపడ్డవే ఎక్కువ
బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 2,031 లాభపడితే.. 561 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో 3ఎం 16 శాతంపైగా దూసుకెళ్లగా.. ఐడీబీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, వక్రంగీ, టాటా గ్లోబల్‌, చోళమండలం, నాల్కో, సెంట్రల్‌ బ్యాంక్‌ తదితరాలు 7-3.5 శాతం మధ్య ఎగశాయి. స్మాల్‌ క్యాప్స్‌లోనూ ఆప్కోటెక్స్‌ 17 శాతం దూసుకెళ్లగా.. ఆప్టెక్‌, రోల్టా, పనాసియా, వడీలాల్‌, 8కే మైల్స్‌, కోప్రాన్‌, బాంబే బర్మా, వాల్‌చంద్‌నగర్, బీపీఎల్‌, ఇండియన్‌ ఆక్రిలిక్స్‌ తదితరాలు 14-8 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular