అమరరాజా బ్యాటరీస్‌కు క్యూ3 స్పార్క్‌

అమరరాజా బ్యాటరీస్‌కు క్యూ3 స్పార్క్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సాధించిన ప్రోత్సాహకర ఫలితాలతో ఆటో విడిభాగాల సంస్థ అమర రాజా బ్యాటరీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 6.3 శాతం జంప్‌చేసి రూ. 849 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 860 వరకూ ఎగసింది.
క్యూ3 భళా
క్యూ3(అక్టోబర్‌-డిససెంబర్‌)లో అమరరాజా నికర లాభం 17 శాతం ఎగసి రూ. 198 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పుంజుకుని రూ. 1553 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు 15.4 శాతం నుంచి 15.6 శాతానికి బలపడ్డాయి. Most Popular