సీజీ పవర్‌కు ఆర్డర్‌ పవర్‌!

సీజీ పవర్‌కు ఆర్డర్‌ పవర్‌!

ఇండొనేసియా అనుబంధ సంస్థ ద్వారా ఆర్డర్‌ పొందిన వార్తలతో సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కౌంటర్ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం పెరిగి రూ. 91 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 92 వరకూ ఎగసింది.
రూ. 360 కోట్లు
సీజీ పవర్‌ సిస్టమ్స్‌ ఇండొనేసియా ద్వారా అక్కడి ప్రభుత్వం నుంచి 64 యూనిట్ల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ సరఫరాకు ఆర్డర్‌ పొందినట్లు సీజీ పవర్‌ పేర్కొంది. ఆర్డర్‌ విలువ 55 మిలియన్‌ డాలర్లు( సుమారు రూ. 360 కోట్లు)గా తెలియజేసింది. డిసెంబర్‌లోగా ఆర్డర్‌ను పూర్తిచేయాల్సి ఉన్నట్లు వెల్లడించింది.Most Popular