సన్‌ ఫార్మాకు హలోల్‌ ప్లాంటు పుష్‌

సన్‌ ఫార్మాకు హలోల్‌ ప్లాంటు పుష్‌

గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంటులో నేటి నుంచి యూఎస్‌ ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టనుందన్న వార్తలతో దేశీ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఊపందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతంపైగా ఎగసి రూ. 601 వద్ద ట్రేడవుతోంది.  
దిద్దుబాటు చర్యలు
గతంలో హలోల్‌ ప్లాంటు ఆడిట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ వ్యక్తం చేసిన అభ్యంతరాలను తొలగించుకునే బాటలో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సన్‌ ఫార్మా పేర్కొంది. దీంతో హలోల్‌ ప్లాంటు ఆడిట్‌కు మరోసారి యూఎస్‌ఎఫ్‌డీఏను ఆహ్వానించినట్లు తెలియజేసింది.Most Popular