టాటా స్టీల్‌ ఫలితాల మెరుపులు!

టాటా స్టీల్‌ ఫలితాల మెరుపులు!

ప్రయివేట్‌ రంగ దిగ్గజం టాటా స్టీల్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సాధించిన ఆకర్షణీయ ఫలితాలతో వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 711 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 716 వరకూ ఎగసింది.
క్యూ3 భేష్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిససెంబర్‌)లో టాటా స్టీల్‌ నికర లాభం రూ. 232 కోట్ల నుంచి రూ. 1136 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం 21 శాతం ఎగసి రూ. 33,447 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 57 శాతం పెరిగి రూ. 5697 కోట్లకు చేరింది. Most Popular