ఆసియా మార్కెట్లు లాభాల్లో!

ఆసియా మార్కెట్లు లాభాల్లో!

ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలకు చెక్‌ పెడుతూ శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడటంతో ఆసియాలోనూ సెంటిమెంటు బలపడింది. జపాన్‌ మార్కెట్‌కు సెలవుకాగా..  ప్రస్తుతం ఆసియాలో అన్ని మార్కెట్లూ లాభాలతో కదులుతున్నాయి. వడ్డీ రేట్లు పెరగనున్న అంచనాలతో గత వారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతీన్న సంగతి తెలిసిందే. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత మళ్లీ ద్రవ్యోల్బణం బలపడుతున్న సంకేతాలు వడ్డీ రేట్ల పెంపునకు వీలు కల్పించనున్నట్లు పలు కేంద్ర బ్యాంకులు ఇప్పటికే సంకేతాలిచ్చాయి. దీంతో అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ గత వారం నాలుగేళ్ల గరిష్టం 2.88 శాతాన్ని తాకగా.. డాలరు రెండు వారాల గరిష్టం 90.56ను తాకింది. 
సానుకూలంగా
ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలో కొరియా, హాంకాంగ్‌, తైవాన్‌, చైనా, థాయ్‌లాండ్‌ 1-0.5 శాతం మధ్య పుంజుకోగా..  సింగపూర్‌ 0.3 శాతం, ఇండొనేసియా 0.15 శాతం చొప్పున బలపడ్డాయి. Most Popular