కేడిలా హెల్త్‌కేర్‌కు ఎఫ్‌డీఏ బూస్ట్‌!

కేడిలా హెల్త్‌కేర్‌కు ఎఫ్‌డీఏ బూస్ట్‌!

దేశీ ఫార్మా సంస్థ కేడిలా హెల్త్‌కేర్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని మొరైయాలో గల ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ విజయవంతంగా తనిఖీలు పూర్తిచేసినట్లు వెల్లడికావడంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 425 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 434 వరకూ ఎగసింది. 
లోపాలు లేవు
ఫిబ్రవరి 5-9 మధ్య మొరైయా ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ ఆడిట్‌ నిర్వహించినట్లు కేడిలా హెల్త్‌కేర్‌ పేర్కొంది. ఈ తనిఖీలలో ఎలాంటి లోపాలనూ గుర్తించకపోవడం కంపెనీకి సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు.Most Popular