డబుల్‌ సెంచరీతో షురూ- రియల్టీ జోరు!

డబుల్‌ సెంచరీతో షురూ- రియల్టీ జోరు!

గత వారాంతాన ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడటంతో దేశీయంగానూ ఆ ప్రభావం పడింది. ప్రామాణిక ఇండెక్స్‌ సానుకూలంగా మొదలై వెనువెంటనే లాభాల డబుల్‌ సెంచరీని అందుకుంది. ప్రస్తుతం 208 పాయింట్లు జంప్‌చేసి 34,214ను తాకింది. తద్వారా గత వారంలో నమోదైన భారీ నష్టాలకు చెక్‌ పెట్టింది. ఇక నిఫ్టీ సైతం 71 పాయింట్లు పెరిగి 10,526 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడటంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు సైతం జోరందుకున్నట్లు తెలియజేశారు.
ఎస్‌బీఐ డీలా
ఎన్‌ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ మాత్రమే 1.35 శాతం తిరోగమించగా..  మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ 2 శాతం జంప్‌చేయగా.. మెటల్‌, ఫార్మా 1.5 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ దాదాపు 4 శాతం జంప్‌చేయగా.. టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, అంబుజా, యాక్సిస్‌, అరబిందో, అదానీ పోర్ట్స్‌, సిప్లా, యూపీఎల్‌, అల్ట్రాటెక్‌ 2.6-1.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే  క్యూ3 ఫలితాలు నిరాశపరచడంతో నిఫ్టీ దిగ్గజాలలో ఎస్‌బీఐ 3 శాతం పతనమైంది. ఈ బాటలో బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌పీసీఎల్‌ 1-0.5 శాతం మధ్య నీరసించాయి.
రియల్టీ షేర్లలో ఇండియాబుల్స్‌, హెచ్‌డీఐఎల్‌, బ్రిగేడ్‌, ఫీనిక్స్‌, ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, యూనిటెక్, శోభా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ 4-1 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular