17 ఏళ్ల తర్వాత నష్టాలు ! ఇక ఎస్బీఐ షేర్ ఎక్కడికి ??

17 ఏళ్ల తర్వాత నష్టాలు ! ఇక ఎస్బీఐ షేర్ ఎక్కడికి ??

మార్కెట్ వర్గాలు ఎవరూ ఊహించని విధంగా ఎస్‌బీఐ అత్యంత నిరుత్సాహక ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలను లాభాలను హరించివేసి నష్టాలను తెచ్చిపెట్టాయి. అక్టోబరు-డిసెంబర్ త్రైమాసికానికి రూ.1886.57 కోట్ల నికర నష్టాన్ని బ్యాంక్ ప్రకటించింది. 17 ఏళ్ల తర్వాత మొదటిసారిగా క్వార్టర్లీ లాస్‌ను బ్యాంక్ ప్రకటించడం గమనించాల్సిన విషయం.  నిరుడు ఇదే సమయానికి రూ.2152.14 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్ ఆర్జించింది. భారీ స్థాయిలో ఉన్న మొండి బకాయిలే ఈ నష్టాలకు కారణంగా చెప్పుకోవచ్చు.  మూడో త్రైమాసికంలో ఏకంగా రూ.25,000 కోట్ల రుణాలను నిరర్థక ఆస్తులుగా మార్చాల్సి వచ్చింది. దీంతో ప్రొవిజనింగ్ (మొండి బకాయిల కోసం కేటాయించాల్సిన మొత్తం)  రూ.7,244 కోట్ల నుంచి రూ.17,759 కోట్లకు పెరిగింది. కేటాయింపులకు తోడు సిబ్బందికి వేతనాల పెంపు వల్ల కూడా రూ.700 కోట్ల వరకూ వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. 

నిరర్థక ఆస్తుల్లో వృద్ధి, బ్యాంక్ ఆస్తుల నాణ్యత పై సందేహాలు, డిపాజిట్లలో నీరసమైన వృద్ధి, రుణవితరణలోనూ పెద్దగా కనిపించిన ప్రోత్సాహం వంటివన్నీ ఎస్బీఐ స్టాక్‌ను సోమవారం రోజున భారీగా క్షీణింపజేయొచ్చు. రాబోయే క్వార్టర్ కూడా ఇలానే ఉండొచ్చంటూ బ్యాంక్ యాజమాన్యం ఇచ్చిన సంకేతాలు పరిస్థితిని మరింత కుంగదీయబోతున్నాయి. Most Popular