ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఈ పథకంతో.. విత్‌డ్రాయల్‌పై ట్యాక్స్ ఉండదు!

ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఈ పథకంతో.. విత్‌డ్రాయల్‌పై ట్యాక్స్ ఉండదు!

బంధన్ ఎస్‌డబ్ల్యూపీ(సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్) పేరుతో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్.. ఒక కొత్త పన్ను ఆదా పెట్టుబడి సాధనాన్ని ప్రకటించింది. వ్యక్తిగతంగా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా.. కుటుంబంలో వారి తర్వాతి సభ్యులకు నెలవారీగా నగదు పొందే సౌలభ్యం అందించడం ఈ పథకం ప్రత్యేకత.
ఇప్పటికే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు చేస్తున్నవారితో పాటు, కొత్త కస్టమర్లకు కూడా.. ఇలా నెలవారీగా తమ పెట్టుబడిలోంచి కొంత మొత్తాన్ని.. ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్‌- గ్రోత్ ఆప్షన్ నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడి చేసిన వ్యక్తి పేరెంట్, సోదరి-సోదరుడు, భాగస్వామి, పిల్లలలో ఎరికైనా ఈ ప్రయోజనం అందుతుంది. 


డివిడెండ్ పేఅవుట్, డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ను ఎంచుకున్న ప్రస్తుత ఇన్వెస్టర్లు.. గ్రోత్ ఆప్షన్‌కు మారడం ద్వారా ఈ విధానంలోకి మారవచ్చు. 
నెలకు రూ. 5000 చొప్పున.. కనీసం 12 నెలల పాటు విత్‌డ్రా చేసుకోవచ్చు. 


తమ కుటుంబ సభ్యులకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయడం అనే అంశం బహుమతి కావడంతో.. దీనికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ మ్యూచువల్ పండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎంఓ డీపీ సింగ్ చెబుతున్నారు. అందుకే బంధన్ ఎస్‌డబ్ల్యూపీ ప్రయోజనకారిగా ఆయన తెలిపారు. డివిడెండ్ పే-అవుట్ ప్రణాళికతో పోల్చితే ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. 


ప్రస్తుత ట్యాక్సింగ్ విధానంలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అందిస్తున్న బంధన్ ఎస్‌డబ్ల్యూపీ అత్యంత  ప్రభావవంతమైన పన్ను ఆదా సాధనంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అనురాధా రావ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఒక కుటుంబ సభ్యునికి మాత్రమే అమలులో ఉన్నా.. రాబోయే కాలంలో ఈ సంఖ్యను పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. 


ప్రస్తుతం మధ్య వయసులో ఉన్న మదుపర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ట్యాక్సింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చీ దీర్ఘకాలిక మూలధన రాబడులపై కూడా 10 శాతం పన్ను చెల్లించాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తర్వాత ఈ కొత్త పథకానికి రూపకల్పన జరిగింది.


 Most Popular