నిఫ్టీ దిగొచ్చినా 17 శాతం వరకు రాబడులిచ్చే స్టాక్స్!

నిఫ్టీ దిగొచ్చినా 17 శాతం వరకు రాబడులిచ్చే స్టాక్స్!

నిఫ్టీ ఇప్పుడు 10500 పాయింట్ల స్థాయికి దిగి వచ్చేసింది. మార్కెట్లలో ఊగిసలాట కొనసాగుతోంది. హైయర్ లెవెల్స్‌ నుంచి మార్కెట్లు 7 శాతం మేర పతనం అ్యాయి. ప్రస్తుతం 100 రోజుల మూవింగ్ యావరేజ్ 10360 వద్ద నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 
ఆప్షన్స్ పరంగా చూస్తే 10000 వద్ద పుట్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ లెవెల్‌ను మరో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్‌గా పరిగణించవచ్చు. హైయర్ లెవెల్స్‌లో 11వేల పాయింట్ల తర్వాత 11500వద్ద కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. 
నిఫ్టీలో లాంగ్ అన్‌వైండింగ్‌తో పాటు షార్ట్ బిల్ట్అప్ పెరగడంతో.. ఇక్కడి నుంచి కరెక్షన్‌కు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.


మరికొన్ని సెషన్ల పాటు మార్కెట్లలో ఊగిసలాటకే అవకాశం ఉండడంతో, స్టాప్‌లాస్‌ను స్ట్రిక్ట్‌గా మెయింటెయిన్ చేయాల్సిందే. అంతే కాదు.. రైజింగ్ మార్కెట్‌లో సెల్లింగ్ వ్యూహం అమలు చేయవచ్చు.
10620 పాయింట్ల వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌ను నిఫ్టీ ఎదుర్కోనుంది. అందుకే పెరిగినప్పుడల్లా అమ్ముతూ 10620ని స్టాప్‌లాస్‌గా పరిగణించాలి. 
ఈ సమయంలో 17 శాతం వరకూ షార్ట్‌టెర్మ్‌లో రాబడులు అందించే 4 స్టాక్స్ గురించి తెలుసుకుందాం.

 

ఐషర్ మోటార్స్: BUY | టార్గెట్ రూ. 30900| స్టాప్‌లాస్ రూ.  26100| రాబడులకు అవకాశం 11%
వీక్లీ ఛార్టుల పరంగా ఈ స్టాక్ రైజింగ్ ఛానల్ ప్యాటర్న్‌లో ఉంది. ఈ ఛానల్ హైయర్ బ్యాండ్‌లో కరెక్షన్‌కు గురైంది. ప్రస్తుతం లోయర్ బ్యాండ్‌నకు చేరువలో ఉంది. ఈ స్థాయిలో బయింగ్ యాక్టివిటీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

 

గోద్రెజ్ కన్జూమర్: BUY | టార్గెట్ రూ. 1130 | స్టాప్‌లాస్ రూ.  970| రాబడులకు అవకాశం 12%
రీసెంట్ ఫాల్ కారణంగా లైఫ్‌టైం హై లెవెల్ రూ. 1128 నుంచి స్టాక్ భారీగా దిగి వచ్చింది. గత కనిష్ట స్థాయి 78.6 శాతం రీట్రేస్మెంట్ సపోర్ట్ వద్ద మద్దతు తీసుకుంది. మంత్లీ ఛార్టుల ప్రకారం హైయర్ టాప్ హైయర్ బాటమ్ ఫామ్ చేస్తున్న ఈ స్టాక్‌లో వాల్యూమ్స్ పెరుగుతున్నాయి.

 

జేఎం ఫైనాన్షియల్: BUY | టార్గెట్ రూ. 190 | స్టాప్‌లాస్ రూ.  140 | రాబడులకు అవకాశం  17%
గత కొంతకాలంగా స్ట్రాంగ్ అప్‌ట్రెండ్ చూపించిన ఈ స్టాక్‌లో.. రీసెంట్‌గా కరెక్షన్ రావడాన్ని.. హెల్దీ కరెక్షన్‌గా పరిగణించవచ్చు. ఆగస్ట్ కనిష్ట స్థాయి 68.2 శాతం వద్ద రీట్రేస్‌మెంట్ జోన్ సపోర్ట్ తీసుకుంది. తాజా పతనం తర్వాత షార్ప్‌గా ఈ స్టాక్ రికవర్ అవుతోంది. 

 

టీఎన్‌పీఎల్: BUY | టార్గెట్ రూ. 490 | స్టాప్‌లాస్ రూ.  375 | రాబడులకు అవకాశం  15%
రూ. 499 హై లెవెల్‌ను తాకిన తర్వాత ఈ స్టాక్ రూ. 365 వరకు కరెక్షన్‌కు గురైంది. అయితే ఆ లెవెల్‌ నుంచి బౌన్స్‌బ్యాక్ తీసుకుంది. అదే స్థాయి 78.6 శాతం రీట్రేస్‌మెంట్ జోన్ అని గమనించాలి. వీక్లీ ఛార్టుల ప్రకారం గత బ్రేకవుట్ జోన్ రూ. 390 నుంచి షార్ప్‌గా పెరుగుతోంది.
 Most Popular