అనుకున్నది ఒకటి..మరి అయ్యేది ఏంటో!

అనుకున్నది ఒకటి..మరి అయ్యేది ఏంటో!

స్టాక్‌మార్కెట్లలో పతనం భారీగా కొనసాగుతోంది. ఈ దశలో ఒక్కసారి గత ఏడాది కాలాన్ని పరిశీలిస్తే..మార్కెట్ కేపిటలైజేషన్ 40 లక్షలకోట్ల రూపాయలకి చేరిందని ఒక లెక్క వేయించుకోవచ్చు. ఇప్పటి పతనం దెబ్బకి దాంట్లో 25శాతం ఆవిరైపోయినట్లేనని అర్ధం అవుతోంది. మరోవైపు 2020నాటికి లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ.40వేలకోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే ఇన్వెస్టర్ల దగ్గరనుంచి రాబట్టడం సంగతేమో కానీ..రెండు రోజుల్లోనే దాదాపు రూ.10లక్షలకోట్ల రూపాయలు గాల్లో కలిసిపోయాయ్. ఈ లెక్కలు చాలు స్టాక్‌మార్కెట్ దీర్ఘకాలిక మూలధనలాభంపై విధించిన పన్నుని ఎలా చూస్తుందేనేది తెలుసుకోవడానికి. మామూలుగా చూస్తే ఏడాదిలోపు వచ్చే లాభంపై 15శాతం పన్ను కడుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా విధించిన పన్ను ఏమిటంటే ఏడాది తర్వాత రూ.లక్ష లాభం వస్తే దానిపై రూ.10వేల రూపాయలు పన్ను కట్టాల్సిందే.! దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. పేరుకు లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ..ఏడాదిని కూడా దీర్ఘకాలికం అనడమే విచిత్రం

బిఎస్ఈ, ఎన్ఎస్ఈలో రూ.40లక్షలకోట్లకిపైగా మార్కెట్ కేపిటలైజేషన్ ఉంది కాబట్టి దానిపై పదిశాతం పన్ను రూపేణా రూ.4లక్షలకోట్లు ప్రభుత్వం ఆశిస్తోందని అంటున్నారు. ఐతే ఇలా మార్కెట్ కేపిటలైజేషన్ పాతికశాతం కోల్పోవడం ఆ లక్ష్యాన్ని అడ్డంగా కోసేసినట్లే భావించాలి. ఎందుకంటే ఈ పతనం ఇప్పట్లో ఆగేదిలా కన్పించడం లేదు కాబట్టి..! పైగా మార్చి 31 లోపు స్టాక్స్ వదిలించుకున్నా..వర్తించేది జనవరి 31 నాటి రేట్లే కాబట్టి..అప్పటిలాభంపై వచ్చే పన్ను కూడా తగ్గొచ్చు. ఏతావాతా తేలేదేంటంటే..ఎల్‌టిసిజి అనేది ఇప్పుడు మార్కెట్లను నష్టపరచడానికే (తాత్కాలికంగా) పనికి వచ్చింది తప్ప నిజంగా ప్రభుత్వం పెట్టుకున్న పన్ను వసూళ్ల లక్ష్యాన్ని మాత్రం చేరుకోకపోవచ్చుMost Popular