వడ్డీ రేట్లు యథాతథమేనా?

వడ్డీ రేట్లు యథాతథమేనా?

బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సమీక్షలో పాలసీ రేట్లను మార్చకపోవచ్చని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండడంతో.. రాబోయే కాలంలో ధరల అదుపునకు  చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

ఇలాంటి సమయంలో కీలక వడ్డీ రేట్లలో మార్పులను చేసేందుకు ఆర్బీఐ సిద్ధం కాకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 
గత 17 నెలలలో అత్యంత వేగంగా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతున్న అంశాన్ని.. ఆర్బీఐ పరిగణలోకి తీసుకోనుంది. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ఆయిల్ ధరలు కూడా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం అవుతున్నాయి.

గత ఆగస్ట్‌లో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత.. వార్షిక ద్రవ్యోల్బణం 5.21 శాతానికి చేరుకుంది. మరోవైపు బడ్జెట్‌లో తీసుకున్న కనీస మద్దతు ధరల పెంపు నిర్ణయం కూడా ఇన్‌ఫ్లేషన్ పెరుగుదలకు కారణం అయింది. Most Popular