ఈ షేర్లు మాత్రం భారీ పతనం నుంచి ఎలా తప్పించుకున్నాయంటే..!?

ఈ షేర్లు మాత్రం భారీ పతనం నుంచి ఎలా తప్పించుకున్నాయంటే..!?

మార్కెట్లలో మహాపతనం కొనసాగుతోంది. ఈ దశలో లాభం గురించి మాట్లాడుకోవడం తక్కువగా కన్పిస్తుంది. వీలైనంత తక్కువ నష్టాలు తెచ్చుకోవడమే తారకమంత్రంలా కన్పిస్తుంది. మరి అలా చేయడానికి మార్గం ఏదైనా ఉందా అంటే..ఉంది..అదే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడమే. ఒక పరిశీలన ప్రకారం చూస్తే మ్యూచువల్ ఫండ్‌లు వాటాలు తీసుకున్న కంపెనీల షేర్లు తక్కువగా నష్టపోయిన విషయం అవగతమవుతోంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌ చూస్తే సగమై కన్పిస్తున్న తరుణంలో ఇవి మాత్రం కేవలం 10శాతం మాత్రమే నష్టపోవడం గమనార్హం. రూ.500కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్‌కి మించి ఉన్న 131 స్టాక్స్‌లో 45 కంపెనీలలో అసలు మ్యూచువల్ ఫండ్ల ఊసే లేదు. మరో 40 స్టాక్స్‌లో 1శాతం మ్యూచువల్ ఫండ్స్ వాటా కలిగి ఉన్నాయ్. ఇక మ్యూచువల్ ఫండ్ల వాటా కలిగిన 110 కంపెనీలని తరచి చూసినప్పుడు 82 కంపెనీల్లో 1శాతం వాటా ఉన్న కంపెనీల షేర్లు తక్కువ నష్టపోయాయ్. వాటిలో ఈక్విటాస్ హోల్డింగ్స్ ఒకటి..ఈ సంస్థ గత మూడు సెషన్లలో 6శాతం మాత్రమే నష్టపోయింది. టాటా మోటర్స్ డివిఆర్, మ్యాక్స్ ఫైనాన్షియల్స్ చూస్తే వరసగా 2శాతం, 0.7శాతం మాత్రమే నష్టపోవడం గమనార్హం ఇలాంటి విశ్లేషణలు చూసిన తర్వాత మ్యూచువల్ ఫండ్ల హోల్డింగ్స్ ఉన్న స్టాక్స్ ప్రస్తుతం నడుస్తోన్న నష్టాల మార్కెట్లలో ఆశాకిరణాలుగా కన్పించడంలో తప్పులేదు

                                                 క్రింది పట్టిక గమనిస్తే పైన చెప్పిన విషయం తేలికగా బోధపడుతుంది

              Most Popular