అసోచామ్ ఆధ్వర్యంలో మైక్రోఫైనాన్స్ పై సదస్సు

అసోచామ్ ఆధ్వర్యంలో మైక్రోఫైనాన్స్ పై సదస్సు

దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు మైక్రోఫైనాన్స్ కంపెనీలు పని చేయాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. మైక్రోఫైనాన్స్ కంపెనీలు పట్టణాలు, నగరాల ప్రాతిపదికగా పని చేస్తున్నాయని ఈ ధోరణి మారి గ్రామీణ  ప్రాంతాల్లోని ప్రజల నైపుణ్యం, వారు చేసే వ్యాపారాలను పరిశీలించి వారికి రుణాలు ఇవ్వాలని సూచించారు. కొన్ని  మైక్రోఫైనాన్స్‌ సంస్థలు వడ్డీ వ్యాపారులుగా మారిపోయాయని , నైతిక విలువలు లేకుండా వ్యాపారం చేస్తున్నారని గవర్నర్ అన్నారు. అసోచామ్‌ ఆధ్వర్యంలో మైక్రోఫైనాన్స్‌పై నిర్వహించిన సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
గతంలో ఏపీలో మైక్రోఫైనాన్స్‌ కంపెనీల వేధింపులు భరించలేక ఎంతో మంది పేదలు ఆత్మహత్యలు చేసుకున్నారని... దీంతో ప్రభుత్వం స్పందించి ఆ సంస్థలపై కఠినచర్యలు తీసుకోవాల్సి వచ్చిందని గవర్నర్ గుర్తుచేశారు. నైపుణ్యం గుర్తించి ఎస్ఎమ్ఈ కంపెనీలను మైక్రోఫైనాన్స్ సంస్థలు రుణాలివ్వాలని తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆయన అన్నారు.Most Popular