పతనంలోనూ నిలబడ్డ పది స్టాక్స్ ఇవే..

పతనంలోనూ నిలబడ్డ పది స్టాక్స్ ఇవే..

బడ్జెట్ 2018 దెబ్బతో సూచీలన్నీ నేల చూపు చూసినప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం ఈ పతనం నుంచి బయటపడ్డాయి. కొత్తగా సూచీల్లో లిస్ట్ అయిన ఓ పది స్టాక్స్ మాత్రం మార్కెట్ కరెక్షన్ బారి నుంచి తప్పించుకున్నాయని చార్ట్స్ ను చూసి గమనించవచ్చు. ఒక వైపు నిఫ్టీ, సెన్సెక్స్ లు భారీగా పతనం అయినప్పటికీ కొత్తగా లిస్ట్ అయిన ఓ పది స్టాక్స్ మాత్రం కరెక్షన్ నుంచి తప్పించుకున్నాయి. ఆ స్టాక్స్ కథేంటో ఓ లుక్కేద్దాం..

పతనం నుంచి బయటపడ్డ న్యూలిస్టెడ్ స్టాక్స్...
- హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 
- న్యూ ఇండియా అస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్
- ఎడ్యూకేషన్ సెస్ 3శాతం నుంచి 4 శాతం పెంపు
- రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్
- జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
- మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
- గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్
- ఖాదిమ్ ఇండియా లిమిటెడ్
- ప్రతాప్ స్నాక్స్ లిమిటెడ్
- ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్
- మహీంద్రా లాజిస్టిక్స్ 

పైన పేర్కొన్న స్టాక్స్ లో చాలావరకూ బీమా కంపెనీలే ఉండటం విశేషం.
ఇందుకు కారణాలను చూస్తే..
- ఎడ్యుకేషన్ సెస్ 3 నుంచి 4 శాతానికి పెంపు
- లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై పది శాతం పన్ను వడ్డింపు కలిసి వచ్చే అంశం 
- ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని 80 జెజెఎఎ సెక్ష‌న్ ప‌రిధి విస్త‌ర‌ణ‌ ద్వారా నూతన ఉద్యోగులకు ఉపలబ్ది 
- అగ్రికల్చర్ కమోడిటీ ట్రేడింగ్‌ను నాన్ స్పెక్యులేటివ్ లావాదేవీగా గుర్తింపు
- ఇండియన్ స్టాంప్ యాక్ట్ లో మార్పులు 
ఇలాంటి చర్యలు బీమా కంపెనీలకు మార్కెట్లో కలిసి వచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు.

బడ్జెట్ -2018లో ముడి జీడిపప్పుపై కస్టమ్స్ సుంకం తగ్గింపు, ఆపరేషన్ గ్రీన్స్ పథకం పేరిట కూరగాయల పెంపకానికి ప్రోత్సాహకం, ఫిషరీస్-పశుసంవర్థక రంగాలకు రూ.పదివేల కోట్ల నిధుల కేటాయింపు గోద్రెజ్ అగ్రోవెట్ షేర్ కు కలిసి వచ్చే అంశంగా మారింది. అలాగే ఫుట్ వేర్ ఉత్పత్తుల దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 20 శాతానికి పెంచడం ఖాదిమ్స్ ఇండియా కు కలిసి రాగా, చిరు తిండ్ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 30 నుంచి 50 శాతం పెంపు ప్రతాప్ స్నాక్స్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్ ఏర్పాటు ఫ్యూచర్ సప్లై చెయిన్, మహీంద్రా లాజిస్టిక్స్ లాంటి షేర్లు పెరిగేందుకు దోహదపడింది.   
 

 Most Popular