మ్యూచువల్ ఫండ్స్‌పై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంతో తెలిస్తే

మ్యూచువల్ ఫండ్స్‌పై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంతో తెలిస్తే


బడ్జెట్ 2018లో లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ పై ట్యాక్స్‌ను తిరిగి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. షేర్లతో పాటు, మ్యూచువల్ ఫండ్స్‌ పైనా ఈ ఎల్‌టీజీసీ ట్యాక్స్ పన్ను పడనుంది. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌పై నికరంగా ఎంత పన్ను కట్టాల్సి ఉంటుంది అనే అంశంపై అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై పన్ను విధానాల్లో రెండు కీలక మార్పులను తీసుకొచ్చింది.

 

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ లాభాలపైనా 10 శాతం పన్ను
ఏ తరహా దీర్ఘకాలిక మూల ధన లాభాలు అయినా రూ. 1 లక్షను దాటితే 10 శాతం పన్ను కట్టాలి. దీంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చిన లాభాలపై కూడా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
2018 జనవరి 31వరకు వచ్చిన లాభాలను పూర్తిగా మినహాయించారు. అంటే ఆ తేదీన క్లోజింగ్ ప్రైస్‌ను కొనుగోలు ధరగా పరిగణిస్తారు. అయితే, మీరు కొనుగోలు చేసిన తేదీ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది.

 

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై అందే డివిడెండ్స్‌కు 10 శాతం పన్ను
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌కు ట్యాక్స్ విధించే నిర్ణయం తీసుకోగానే, ఆటోమేటిక్‌గా డివిడెండ్స్‌పై కూడా పన్ను విధింపు వర్తిస్తుంది. అంటే, డివిడెండ్ ఆప్షన్‌కు మార్చుకోవడం ద్వారా పన్ను నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచన సరికాదు.

ఈ ప్రభావంతో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌పై అందే డివిడెండ్స్‌కు  కూడా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

 

కొత్త పన్ను విధానం చూపే పట్టిక:
వ్యక్తులకు మ్యూచువల్ ఫండ్స్‌పై మారిన పన్నులు

 

ఫండ్ రకం

లాంగ్ టెర్మ్‌ గడువు

లాంగ్‌టెర్మ్ గెయిన్స్‌పై పన్ను (శాతం)

షార్ట్‌టెర్మ్ గెయిన్స్‌పై పన్ను (శాతం)

డివిడెండ్స్‌పై పన్ను (శాతం)

ఈక్విటీ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్ సహా) 1 ఏడాది

10 

(ఇండెక్సేషన్ ఉండదు) *

15 10 #
డెట్ ఫండ్స్ 3 ఏళ్లు

20

(ఇండెక్సేషన్ తర్వాత)

మీ ఆదాయపు పన్ను రేటు 25 $

లిక్విడ్/ మనీ మార్కెట్ ఫండ్స్

3 ఏళ్లు

20

(ఇండెక్సేషన్ తర్వాత)

మీ ఆదాయపు పన్ను రేటు 25 $
ఆర్బిట్రేజ్ ఫండ్స్ 1 ఏడాది

10

(ఇండెక్సేషన్ ఉండదు)

15 10 #

హైబ్రిడ్ ఫండ్స్

- అగ్రెసివ్(బ్యాలెన్స్‌డ్) 1 ఏడాది

10 

(ఇండెక్సేషన్ ఉండదు)

15 10 #
- కన్జర్వేటివ్(ఎంఐపీ) 3 ఏళ్లు

20

(ఇండెక్సేషన్ తర్వాత)

మీ ఆదాయపు పన్ను రేటు  25 $

* రూ. లక్ష వరకు లాభాలపై పన్ను ఉండదు, రూ. 1 లక్ష దాటిన లాభాలపై 10 శాతం పన్ను చెల్లించాలి. గతంలో ఇది 0%.

కొనుగోలు ధరను 2018 జనవరి 31 ప్రకారం క్లోజింగ్ ధర లెక్కించడం జరిగింది.

+ మీ ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం సర్‌ఛార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్‌గా 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

# 10 శాతం డివిడెండ్ ట్యాక్స్ + సర్‌ఛార్జ్ 12 శాతం + సెస్ 4 శాతం = 11.648 శాతం పన్ను

$ డివిడెండ్ ట్యాక్స్ 25 శాతం + సర్‌ఛార్జ్ 12 శాతం + సెస్ 4 శాతం = 29.12 శాతం పన్ను

హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్‌ 4 శాతం(గతంలో ఇది 3 శాతం)

 

ఈ పన్నులను కట్టేస్తే సరిపోతుందని అనుకోవడం సరికాదు. మీ ఆదాయం ఆధారంగా సర్‌ఛార్జ్‌ కూడా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అన్ని రకాల పన్నులపై 4 శాతం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ కట్టాలి. గతంలో ఇది 3 శాతంగా ఉండేది.

 

వ్యక్తులకు సర్‌ఛార్జ్ & సెస్ కలిపి మొత్తం ట్యాక్స్
 

ఫండ్ రకం

రూ. 50 లక్షల కంటే

తక్కువ ఆదాయం

రూ.50 లక్షల నుంచి 

రూ. 1 కోటి వరకు ఆదాయం

రూ. 1 కోటికి

మించిన ఆదాయం

ఈక్విటీ స్కీమ్స్ -

డివిడెండ్స్ #

11.468 శాతం ( 10 శాతం పన్ను +  సర్‌ఛార్జ్ 12% + సెస్ 4 శాతం )

ఈక్విటీ స్కీమ్స్ -

లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ +

10.40 శాతం

11.44 శాతం

11.96 శాతం

ఈక్విటీ స్కీమ్స్ -

షార్ట్‌ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ +

15.60 శాతం

17.16 శాతం

17.94 శాతం

డెట్/లిక్విడ్ స్కీమ్స్ -

డివిడెండ్స్ $ 

29.12 శాతం ( 25 శాతం పన్ను +  సర్‌ఛార్జ్ 12% + సెస్ 4 శాతం )

డెట్/లిక్విడ్ స్కీమ్స్ -

లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ + 

ఇండెక్సేషన్ తర్వాత 20 శాతం + ఆదాయం ఆధారంగా సర్‌ఛార్జ్ + 4 శాతం సెస్ 

డెట్/లిక్విడ్ స్కీమ్స్ -

షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ + 

మీ వ్యక్తిగత పన్ను రేటు + ఆదాయం ఆధారంగా సర్‌ఛార్జ్ + 4 శాతం సెస్ 

 

గ్రోత్, డివిడెండ్, రీఇన్వెస్ట్‌మెంట్, డివిడెండ్ పే-అవుట్‌లలో ఇప్పుడు ఏ తరహా ఆప్షన్ ఎంచుకోవాలన్నదే అసలు ఆలోచన.

ఎప్పుడైనా సరే గ్రోత్ ఆప్షన్‌ను మాత్రమే ఎంచుకోండి. మీకు రెగ్యులర్ ఇన్‌కం కావాలంటే మాత్రమే పే-అవుట్ ఆప్షన్ తీసుకోవాలి.

మీరు పొందే డివిడెండ్స్‌ను తిరిగి పెట్టుబడి చేయడం ద్వారా, అధికంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అయితే, పూర్తిగా గ్రోత్ ఆప్షన్ మాత్రమే ప్రయోజనకారిగా ఉంటుంది. ఇది మీకు అదనంగా లక్షల కొద్దీ కార్పస్‌ను క్రియేట్ చేసిపెడుతుంది. గ్రోత్, డివిడెండ్ ఆప్షన్స్‌ మధ్య బేధాలను ఈ కింది పట్టిక వివరిస్తుంది.

ఒకవేళ మీరు 30 శాతం ట్యాక్స్‌ బ్రాకెట్‌లో ఉన్నట్లయితే మీరు డివిడెండ్ పే-అవుట్ ఆప్షన్‌ను ఎంచుకోవడమే ఉత్తమం. ఎందుకంటే మీరు అందుకునే డివిడెండ్ పై 29.12 శాతం అయితే.. మీ ఆదాయపు పన్ను 30 శాతానికి సర్‌ఛార్జ్ మరియు సెస్ కూడా కలిపి కట్టాల్సి ఉంటుంది..

ఫండ్ రకం పెట్టుబడి వ్యవధి ఆప్షన్ ఎందుకు?

ఈక్విటీ ఫండ్స్

బ్యాలెన్స్‌డ్ ఫండ్స్

ఆర్బిట్రేజ్ ఫండ్స్

ఏడాది కంటే తక్కువ డివిడెండ్ పే-అవుట్ #

ఏడాది కంటే తక్కువ హోల్డింగ్స్‌పై 15 శాతం పన్ను,

కానీ డివిడెండ్స్‌పై 10 శాతం పన్ను.

ఈక్విటీ ఫండ్స్

బ్యాలెన్స్‌డ్ ఫండ్స్

ఆర్బిట్రేజ్ ఫండ్స్

 

ఏడాది కంటే ఎక్కువ గ్రోత్ +

ఏడాది కంటే ఎక్కువగా హోల్డింగ్ చేసినపుడు

లాభాలపై పన్ను 10 శాతంగా ఉంటుంది.

ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్

3 ఏళ్ల కంటే ఎక్కువ గ్రోత్ +

పెట్టుబడి చేసి 3 ఏళ్ల సమయం దాటి ఉంటుంది,

డివిడెండ్స్ పొందితే మళ్లీ 3 ఏళ్లపాటు లాక్ అవుతాయి.

డెట్ ఫండ్స్

ఇన్‌కం ఫండ్స్

లిక్విడ్ ఫండ్స్

3 ఏళ్ల కంటే తక్కువ గ్రోత్ +

మీ లాభాలపై 10 శాతం లేదా డివిడెండ్ ట్యాక్స్ రేట్ 25 శాతం

రెండింటిలో ఏది తక్కువైతే అది చెల్లించాలి.

డెట్ ఫండ్స్

ఇన్‌కం ఫండ్స్

లిక్విడ్ ఫండ్స్

3 ఏళ్ల కంటే ఎక్కువ గ్రోత్ + ఇండెక్సేషన్ తర్వాత మీ లాభాలపై 20 శాతం పన్ను ఉంటుంది.

అన్ని పన్ను రేట్లు బేస్ రేట్లు మాత్రమే. సర్‌ఛార్జ్ లేదా ఎడ్యుకేషన్ సెస్ కలపలేదు. మరియు మీ ఆదాయం ఆధారంగా సర్‌ఛార్జ్, 4 శాతం ఎడ్యుకేషన్ సెస్ కట్టాల్సి ఉంటుంది,

# 10 శాతం డివిడెండ్ ట్యాక్స్ + సర్‌ఛార్జ్ 12 శాతం + సెస్ 4 శాతం = 11.648 శాతం పన్ను

డివిడెండ్ ట్యాక్స్ 25 శాతం + సర్‌ఛార్జ్ 12 శాతం + సెస్ 4 శాతం = 29.12 శాతం పన్నుMost Popular