గలాక్సీ సర్ఫక్టేంట్స్‌ ఐపీవో హిట్‌!

గలాక్సీ సర్ఫక్టేంట్స్‌ ఐపీవో హిట్‌!

సర్ఫక్టేంట్స్‌సహా ఇతర స్పెషాలిటీ కెమికల్స్‌ తయారు చేసే గలాక్సీ సర్ఫక్టేంట్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి చివరి రోజు బుధవారానికల్లా 20రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 44.32 లక్షల షేర్లను విక్రయానికి ఉంచితే..  8.81 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇష్యూకి అర్హగతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగం 54 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ కాగా... రిటైలర్లు 5.5 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 7 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. రూ. 10 ముఖ విలువగల ఒక్కోషేరుకీ ధరల శ్రేణి రూ. 1470-1480కాగా.... తద్వారా రూ. 937 కోట్లు సమీకరించింది.
కంపెనీ వివరాలివీ
వ్యక్తిగత సంరక్షణ, గృహ పరిరక్షణ వంటి విభాగాలలో వినియోగించే స్పెషాలిటీ కెమికల్స్‌ను గలాక్సీ సర్ఫక్టేంట్స్‌ తయరు చేస్తోంది. అంటే స్కిన్‌ కేర్‌, ఓరల్‌ కేర్‌, హెయిర్‌ కేర్‌, కాస్మెటిక్స్‌, టాయిలెటరీస్‌, డిటర్జెంట్స్‌ తదితర ఉత్పత్తులకు అవసరమైన కెమికల్స్‌ సరఫరా చేస్తోంది. దేశీయంగా అగ్రగణ్య సర్ఫక్టేంట్స్‌ తయారీ సంస్థలలో ఒకటైన కంపెనీ కస్టమర్లలో పలు దేశ, విదేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలున్నాయి. కెవిన్‌కేర్‌, కాల్గేట్‌ పామోలివ్‌, హిమాలయ, ఎల్‌ఓరియల్‌, పీఅండ్‌జీ డాబర్‌, హెంకెల్‌ తదితరాలకు ప్రొడక్టులను అందిస్తోంది. కంపెనీ అమ్మకాలలో పెర్ఫార్మెన్స్‌ సర్ఫక్టెంట్స్‌ వాటా 65 శాతంకాగా.. స్పెషాలిటీ కేర్‌ ప్రొడక్టుల వాటా 35 శాతంగా ఉంటోంది. అమెరికా, ఆసియాలోని పలుదేశాలకు ప్రొడక్టులను ఎగుమతి చేస్తోంది.Most Popular