హైదరాబాద్‌లో టాటా స్ట్రైవ్‌ స్కిల్‌ డెవలప్‌ సెంటర్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో టాటా స్ట్రైవ్‌ స్కిల్‌ డెవలప్‌ సెంటర్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో మొట్టమొదటి టాటా స్ట్రైవ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(టీఎస్‌ఎస్‌డీసీ)ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దేశంలో ఉపాధి అవకాశాలకు కొదువ లేదని, యువతకు శిక్షణ ఇచ్చి సరైన దిశగా నడిపిస్తే భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఎదుగుతుందని ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో 50 కోట్ల మందికి పైగా యువత ఉన్నారని, వారికి సరైన శిక్షణనిస్తే భారత్‌ ఆర్థికంగా చక్కని పురోగతి సాధిస్తుందని చెప్పారు. టాటా సంస్థలు విశ్వసనీయతకు మారుపేరని, జంషెడ్ పూర్ తర్వాత హైదరాబాద్ లోనే టాటా సంస్థలు ఎక్కువ ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. టాస్క్ ఆధ్వర్యంలోనూ యువతకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని ఈ సందర్భంగా  కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్‌లోని కూకటపల్లిలో17వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు టాటా స్ట్రైవ్ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనితా రాజన్‌ చెప్పారు. తెలంగాణలోని నైపుణ్యం కలిగిన యువతకు బీపీఓ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీమా, రిటైల్ రంగాల్లో తమ సంస్థ శిక్షణ అందించనున్నట్టు తెలిపారు.Most Popular