2018లో పీఎస్‌యూ ఐపీవోల వెల్లువ?!

2018లో పీఎస్‌యూ ఐపీవోల వెల్లువ?!

రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాటపట్టింది. ఇందుకు వీలుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా డ్రాఫ్ట్‌ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీంతో ఈ ఏడాది ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసుకున్న పీఎస్‌యూ సంస్థల జాబితాలో నాలుగో కంపెనీగా నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఐపీవోకి అనుమతించమంటూ పీఎస్‌యూ సంస్థలు మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌, ఆర్‌ఐటీఈఎస్‌(రైట్స్‌) లిమిటెడ్‌, ఇండియన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఐఆర్‌ఈడీఏ) సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి.
కంపెనీ వివరాలివీ..
1970లో ఏర్పాటైన భారత్‌ డైనమిక్స్‌ గైడెడ్‌ మిస్సైల్స్‌ తయారీతోపాటు రక్షణ రంగ పరికరాలను సైతం రూపొందిస్తోంది. 2017 మార్చికల్లా కంపెనీ నెట్‌వర్త్‌ రూ. 2212 కోట్లుగా నమోదైంది. నిజానికి గతేడాది ఏప్రిల్‌లోనే కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు పీఎస్‌యూల డిజిన్వెస్ట్‌మెంట్‌కూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.Most Popular