యూరప్‌ మార్కెట్లకూ షట్‌డౌన్‌ ఖుషీ!

యూరప్‌ మార్కెట్లకూ షట్‌డౌన్‌ ఖుషీ!

యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌కు ఎట్టకేలకు ముగింపు పలకడంతో యూరోపియన్‌ స్టాక్ మార్కెట్లకూ బలమొచ్చింది. దీంతో సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో ప్రస్తుతం యూకే ఇండెక్స్ ఫుట్సీ, ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.2 శాతం స్థాయిలో బలపడ్డాయి. జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ మరింత అధికంగా 0.9 శాతం ఎగసింది. 
ఈజీ జెట్‌ హైజంప్‌
కొద్ది రోజులుగా ఆందోళనలు పెంచిన యూఎస్‌ షట్‌డౌన్‌కు తెరపడటంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. సోమవారం అమెరికా మార్కెట్లు పుంజుకోగా... నేటి ట్రేడింగ్‌లో ఆసియాలోనూ అన్ని మార్కెట్లూ 2-1 శాతం మధ్య జంప్‌చేశాయి. యూరోపియన్‌ స్టాక్స్‌లో బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ ఈజీ జెట్‌ 6.5 శాతం ఎగసింది. రిటైలింగ్‌ దిగ్గజం క్యారీఫోర్‌ 4.5 శాతం పెరిగింది.Most Popular