మార్కెట్ల స్పీడ్‌- చిన్న షేర్లు అప్‌!

మార్కెట్ల స్పీడ్‌- చిన్న షేర్లు అప్‌!

అమెరికా నుంచి ఆసియా వరకూ లాభాల దౌడు తీస్తున్న మార్కెట్లు దేశీయంగానూ ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఇప్పటికే బుల్‌ ర్యాలీలో సాగుతున్న మార్కెట్లు దీంతో మార్కెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 233 పాయింట్లు జంప్‌చేసి 36,030 వద్ద కదులుతుంటే.. నిఫ్టీ 81 పాయింట్లు ఎగసి 11,047 వద్ద ట్రేడవుతోంది.
మిడ్‌ క్యాప్‌ భేష్‌
బీఎస్‌ఈలో ప్రస్తుతం మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.3 శాతం జంప్‌చేయగా.. స్మాల్‌ క్యాప్‌ 0.6 శాతం పెరిగింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1572 లాభపడితే.. 1068 నష్టాలతో కదులుతున్నాయి. 
జోరుజోరుగా
మిడ్‌ క్యాప్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 11 శాతంపైగా దూసుకెళ్లగా.. బయోకాన్‌, ఆర్‌కామ్‌, సెయిల్‌, ఇండియన్‌ హోటల్స్‌, హావెల్స్‌, జీఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, వక్రంజీ, నాల్కో, పెట్రోనెట్‌ తదితరాలు 6-3 శాతం మధ్య ఎగశాయి. స్మాల్‌ క్యాప్స్‌లోనూ పనాసియా బయో 16 శాతం జంప్‌చేయగా.. ఎలెకాన్‌, ఆల్కిల్‌ అమైన్స్‌, ఇంద్రప్రస్థ, కల్పతరు, హెస్టెరో బయో, ద బైక్‌, తాజ్‌ జీవీకే, విమ్టా లేబ్స్‌, శాస్కన్‌ తదితరాలు 10-6 శాతం మధ్య ఎగశాయి.Most Popular