ఓమ్‌ మెటల్స్‌కు సెటిల్‌మెంట్‌ పుష్

ఓమ్‌ మెటల్స్‌కు సెటిల్‌మెంట్‌ పుష్

జైపూర్‌ భూమి వివాదం సెటిల్‌మెంట్ జరిగినట్లు వెల్లడికావడంతో ఓమ్‌ మెటల్స్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు దృష్టిపెట్టడంతో ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 3.4 శాతం పెరిగి రూ. 69 సమీపంలో ట్రేడవుతోంది.  
మొత్తం 56,000 చదరపు మీటర్లలోగల భూమికి సంబంధించి రాజస్తాన్‌ హైకోర్టు నుంచి సెటిల్‌మెంట్‌ ఆదేశాలు జారీ అయినట్లు ఓమ్‌ మెటల్స్‌ పేర్కొంది. తద్వారా రియా గార్మెంట్స్‌తో వివాదానికి తెరపడనున్నట్లు తెలియజేసింది.Most Popular