ఇండొకొ రెమిడీస్‌కు ఫండ్‌ సపోర్ట్‌!

ఇండొకొ రెమిడీస్‌కు ఫండ్‌ సపోర్ట్‌!

రిలయన్స్ మ్యూచువల్‌ ఫండ్‌ వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఇండొకొ రెమిడీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 299 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 303 వరకూ ఎగసింది. 
రూ. 275 ధరలో
బీఎస్‌ఈ ద్వారా రిలయన్స్ కేపిటల్‌ ట్రస్టీకి చెందిన రిలయన్స్ గ్రోత్‌ ఫండ్‌ 12.11 లక్షల ఇండొకో రెమిడీస్‌ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 275 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు బీఎస్ఈ డేటా వెల్లడిస్తోంది. కాగా.. ఇండొకోలో రిలయన్స్ ఫార్మా ఫండ్‌ 1.87 శాతం వాటాను కలిగిఉంది.Most Popular