ఆసియా మార్కెట్లకు యూఎస్‌ జోష్‌!

ఆసియా మార్కెట్లకు యూఎస్‌ జోష్‌!

ఎట్టకేలకు ప్రభుత్వ షట్‌డౌన్‌కు స్వస్తి పలకడంతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడటంతో ఆసియా మార్కెట్లకూ హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడతం పలు మార్కెట్లు లాభాల హైజంప్‌చేశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, ఇండొనేసియా, జపాన్‌, కొరియా, చైనా 1 శాతం స్థాయిలో పురోగమించగా.. థాయ్‌లాండ్‌, సింగపూర్‌ 0.35 శాతం చొప్పున బలపడ్డాయి. తైవాన్‌ నామమాత్ర లాభంతో కదులుతోంది.
కరెన్సీల తీరిదీ
ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 90.34 వద్ద కదులుతోంది. జపనీస్‌ యెన్‌ తొలుత 111.25కు చేరి ప్రస్తుతం 110.98కు చేరింది. ఇక యూరో 1.225 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. Most Popular