బడ్జెట్ రోజున కన్నేయాల్సిన టాప్ 20 స్టాక్స్

బడ్జెట్ రోజున కన్నేయాల్సిన టాప్ 20 స్టాక్స్

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అందించే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రజాకర్షక బడ్జెట్ అందించే అవకాశాలు ఉన్నా.. అదే సమయంలో అభివృద్ధి కోసం బాటలు కూడా వేయవచ్చని అంటున్నారు. 

రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్ 3.5 శాతంగా నమోదు కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. మరుసటి ఆర్థిక సంవత్సరానికి దీన్ని 3.3-3.4 శాతానికి పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోంది. 

ప్రభుత్వం కొత్త ఖర్చులు పెట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నా.. రోడ్లు,  మెట్రోలు, హౌసింగ్, ఇరిగేషన్, డిఫెన్స్ వంటి అభివృద్ధికి దోహదం చేసే రంగాలపై ప్రాధాన్యత ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఈ ఏడాది బడ్జెట్‌పై ఉన్న అంచనాల ప్రకారం 4 సెక్టార్లకు చెందిన 20 స్టాక్స్‌పై దృష్టి నిలపవచ్చని బ్రోకరేజ్ హౌస్‌లు చెబుతున్నాయి.

 

వ్యవసాయం
స్టాక్స్ ఇన్ ఫోకస్: ధనుక అగ్రిటెక్, పీఐ ఇండస్ట్రీస్, కావేరీ సీడ్స్, చంబల్ ఫెర్టిలైజర్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ 
స్వల్పకాల వ్యవధి గల వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల పెంచవచ్చని బ్రోకరేజ్ సంస్ధలు అంచనా వేస్తున్నాయి. ఇది ధనుక అగ్రిటెక్, పీఐ ఇండస్ట్రీస్, కావేరీ సీడ్స్‌కు అనుకూలం.
న్యాచరల్ గ్యాస్‌ను 5 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లోకి తెచ్చే అవకాశం ఉన్నాయన్న అంచనాలు.. చంబల్ ఫెర్టిలైజర్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్‌పై ప్రభావం చూవచ్చు.

 

అటోమొబైల్
స్టాక్స్ ఇన్ ఫోకస్: హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి ఇండియా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్
10/15 సంవత్సరాలకు మించిన పాత వాహనాలను స్క్రాప్ చేయడంపై ఇన్సెంటివ్స్ ప్రకటించవచ్చని అంటున్నారు. దీనిపై అమలులో ఉన్న నిబంధనలు మారవచ్చు. వ్యవసాయ రంగానికి లభిస్తున్న ప్రోత్సాహం కారణంగా ఉత్పాదకత/ఆదాయ స్థాయిలు పెరగవచ్చు. ఇది హీరో మోటోకార్ప్, ఎం అండ్ ఎం, మారుతి సుజుకిలకు సానుకూలం.

అలాగే జేఎన్ఎన్‌యూఆర్ఎంకు నిధులు పెంచితే బస్ తయారీ కంపెనీలకు లాభదాయకం. ఇది అశోక్ లేల్యాండ్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్‌పై ప్రభావం చూపవచ్చు.

 

క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్
స్టాక్స్ ఇన్ ఫోకస్: ఎల్ అండ్ టీ, కల్పతరు పవర్, కేఈసీ ఇంటర్నేషనల్
డిఫెన్స్ రంగానికి మూడేళ్ల నుంచి తగినంత నిధులు కేటాయించకపోవడంతో.. ఈ ఏడాది భారీగా చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ఎల్ అండ్ టీ, బీఈఎంఆల్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఫోర్జ్ వంటి కంపెనీలపై ప్రభావం చూపవచ్చు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పవర్ ట్రాన్స్‌మిషన్, రైల్వేలకు నిధులు కేటాయించే ప్రణాళికల కారణంగా కేఈసీ ఇంటర్నేషనల్, కల్పతరు, ఎల్ అండ్ టీ కంపెనీలు లాభపడతాయి.

 

బీఎఫ్‌ఎస్ఐ
స్టాక్స్ ఇన్ ఫోకస్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ హౌసింగ్, కెన్‌ఫిన్ హోమ్స్, జీఐసీ హౌసింగ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ 
పీఎస్‌యూ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ అంశంపై.. బడ్జెట్‌లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుందని బ్రోకరేజ్ హౌస్‌లు అంటున్నాయి. ఇది ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి కంపెనీలపై ప్రభావం చూపనుంది.

అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీకి మద్దతునిచ్చే నిర్ణయాలు పీఎన్‌బీ హౌసింగ్, కెన్‌ఫిన్ హోమ్స్, జీఐసీ హౌసింగ్ లాభపడనున్నాయి.
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదాయపు పన్ను చట్టం 115జేబీలో ఉన్న మ్యాట్‌పై లెవీని తొలగించవచ్చని అంటున్నారు. ఇది జీఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలకు  సహకరించనుంది. 
 Most Popular