70 శాతం ప్రీమియంతో అపోలో మైక్రో సిస్టమ్స్ లిస్టింగ్

70 శాతం ప్రీమియంతో అపోలో మైక్రో సిస్టమ్స్ లిస్టింగ్

హైదరాబాద్‌ కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్‌ ఇవాళ మార్కెట్లలో భారీ ప్రీమియంతో లిస్ట్ అయింది. ముందు నుంచి ఉన్న అంచనాలకు తగినట్లుగానే అపోలో మైక్రో లిస్టింగ్‌లోనే మంచి లాభాలను గడించింది. 

మదుపర్ల నుంచి వచ్చిన భారీ స్పందనతో.. ఆరంభంలోనే 70 శాతం పెరిగిపోయింది ఈ కంపెనీ. ఇష్యూ ధర రూ. 275తో పోల్చితే 70 శాతం లాభంతో రూ. 470 వద్ద లిస్ట్ అయిన అపోలో మైక్రో సిస్టమ్స్.. రూ. 480 వరకూ పెరిగింది.

ప్రస్తుతం 60 శాతం లాభంతో రూ. 442 వద్ద అపోలో మైక్రో సిస్టమ్స్ ట్రేడవుతోంది.

ఇష్యూ వివరాలు
అపోలో మైక్రో పబ్లిక్‌ ఇష్యూకు 248 రెట్ల స్పందన లభించిన సంగతి తెలిసిందే. రూ.270-275 ప్రైస్‌బాండ్‌‌తో  41.45 లక్షల షేర్లకు ఆఫర్ చేయగా..  102.95 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. మన దేశ ఐపీఓ చరిత్రలో 200 రెట్లకు పైగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిన నాలుగా కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్‌ కావడం గమనార్హం. గతంలో ఇన్ఫోటెక్‌, సలాసర్‌ టెక్నో ఇంజనీరింగ్‌, ఆస్ట్రన్‌ పేపర్‌ అండ్‌ బోర్డ్‌ మిల్స్‌ 243 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. అందుకు తగ్గట్లుగానే భారీ ప్రీమియంతో మార్కెట్లలో లిస్ట్ అయింది అపోలో మైక్రో సిస్టమ్స్.
 Most Popular