హెచ్‌సీఎల్‌ టెక్‌ గైడెన్స్‌ ఫర్వాలేదు!

హెచ్‌సీఎల్‌ టెక్‌ గైడెన్స్‌ ఫర్వాలేదు!

దేశీయంగా సాఫ్ట్‌వేర్‌ సేవలకు నాలుగో ర్యాంకులో ఉన్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది.  దీంతో ఎన్‌ఎస్ఈలో ఈ  షేరు దాదాపు 0.4 శాతం బలపడి రూ. 958 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 967 వద్ద 52 వారాల గరిష్ట్నాన్ని తాకగా, రూ. 946 వద్ద కనిష్టాన్ని సైతం చవిచూసింది!
ఫలితాలు ఓకే
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 6 శాతం పెరిగి రూ. 2194 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతంపైగా పెరిగి రూ. 12,808 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 2 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. ఈ ఏడాది ముగిసేసరికి ఆదాయం 10.5-12.5 శాతం స్థాయిలో పుంజుకోగలదని కంపెనీ అంచనా(గైడెన్స్‌) వేసింది.Most Popular