క్యూ3-జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ హైజంప్‌!

క్యూ3-జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ హైజంప్‌!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తొంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ  షేరు దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 2078 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2085 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం!
ఫలితాలు భేష్‌
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డోమినోస్‌ పిజ్జా స్టోర్ల నిర్వహణ సంస్థ జూబిలెంట్‌ ఫుడ్‌ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 66 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 21 శాతం వరకూ పెరిగి రూ. 798 కోట్లను తాకింది.Most Popular