కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ క్యూ3 ఓకే

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ క్యూ3 ఓకే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ కొటక్‌ మహీంద్రా ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన క్యూ(అక్టోబర్‌-డిసెంబర్‌)3లో కొటక్‌ బ్యాంక్‌ నికర లాభం 20 శాతం ఎగసి రూ. 1053 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 17 శాతం పెరిగి రూ. 2,394 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం పెరిగి రూ. 1058 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1060 వరకూఎగసింది. 
ఎన్‌పీఏలు తగ్గాయ్‌
త్రైమాసిక ప్రాతిపదికన బ్యాంక్‌ స్థూల  మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.47 శాతం నుంచి స్వల్పంగా 2.31 శాతానికి తగ్గాయి.  నికర ఎన్‌పీఏలు సైతం 1.26 శాతం నుంచి నామమాత్రంగా 1.09 శాతానికి నీరసించాయి. ప్రొవిజన్లు రూ. 217 కోట్ల నుంచి రూ. 213 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. సీఏఆర్‌ 17 శాతాన్ని అధిగమించగా.. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.2 శాతంగా నమోదైంది.Most Popular