వండర్‌లాకు జీఎస్‌టీ హాలిడేస్‌!

వండర్‌లాకు జీఎస్‌టీ హాలిడేస్‌!

గురువారం సమావేశమైన జీఎస్‌టీ కౌన్సిల్ థీమ్‌ పార్కులు తదితరాలపై పన్ను శాతాన్ని తగ్గించడంతో వండర్‌లా హాలిడేస్‌ కౌంటర్‌కు వెలుగొచ్చింది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 408 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 425 వరకూ జంప్‌చేసింది.
18 శాతానికి
థీమ్‌ పార్కులు, వాటర్‌ పార్కులు, జాయ్‌ రైడ్స్‌, గోకార్టింగ్‌, బాలెట్‌ తదితరాలపై వస్తు, సేవల పన్ను పరిమితిని ప్రస్తుత 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. దీంతో వండర్‌లా హాలిడేస్‌ కౌంటర్‌కు బలమొచ్చింది.Most Popular