మార్కెట్లకు బ్యాంక్‌ నిఫ్టీ దన్ను!

మార్కెట్లకు బ్యాంక్‌ నిఫ్టీ దన్ను!

బ్యాంకింగ్‌ కౌంటర్లకు కొనసాగతున్న డిమాండ్‌ కారణంగా మార్కెట్లు ప్రోత్సాహకరంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 141 పాయింట్లు ఎగసి 35,401ను తాకగా.. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 10,850 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.25 శాతం పుంజుకోగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.5 శాతం బలపడింది. అయితే మెటల్‌, ఆటో రంగాలు 0.3 శాతం చొప్పున నీరసించాయి.
డెరివేటివ్స్‌లో
ఎన్‌ఎస్ఈ ఎఫ్‌అండ్‌వో విభాగంలో బయోకాన్‌ 5 శాతం జంప్‌చేయగా.. అదానీ పోర్ట్స్‌, వోల్టాస్‌, రెప్కోహోమ్‌, దివాన్‌ హౌసింగ్, పీఎన్‌బీ, కేడిలా హెల్త్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఐబీ హౌసింగ్, కంకార్‌ 3-2 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు జిందాల్‌ స్టీల్‌, హింద్‌ జింక్‌, వొకార్డ్‌, ఆర్‌కామ్, సీమెన్స్‌, దాల్మియా భారత్‌, మహానగర్‌ గ్యాస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, హెచ్‌డీఐఎల్‌, ఐఆర్‌బీ 3-2 శాతం మధ్య తిరోగమించాయి.Most Popular