ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి!

ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి!

గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేయగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 0.4 శాతం స్థాయిలో తిరోగమించగా.. మిగిలిన అన్ని మార్కెట్లూ లాభాలతో ట్రేడవుతున్నాయి. తైవాన్‌, సింగపూర్‌, చైనా 0.3 శాతం స్థాయిలో పుంజుకోగా.. హాంకాంగ్‌, జపాన్‌, కొరియా 0.2 శాతం స్థాయిలో బలపడ్డాయి.
కరెన్సీల తీరిదీ
ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 90.11 వద్ద కనిష్టాన్ని తాకి తిరిగి స్వల్ప రికవరీతో 90.49 వద్ద కదులుతోంది. జపనీస్‌ యెన్‌ 111 దిగువన 110.87కు చేరగా... యూరో 1.23 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. Most Popular