శ్వాన్‌ ఎనర్జీకి నిధుల ఎనర్జీ!

శ్వాన్‌ ఎనర్జీకి నిధుల ఎనర్జీ!

అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్‌), ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌, రుణ సెక్యూరిటీల జారీ తదితర మార్గాలలో నిధుల సమీకరణకు బోర్డు అనుమతించిన వార్తలతో శ్వాన్‌ ఎనర్జీ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 5.4 శాతం జంప్‌చేసి రూ. 224 వద్ద ట్రేడవుతోంది.
రూ. 1000 కోట్లు
వివిధ మార్గాల ద్వారా రూ. 1,000 కోట్లను మించకుండా నిధుల సమీకరణకు గురువారం సమావేశమైన బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు శ్వాన్‌ ఎనర్జీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తాజాగా వెల్లడించింది.Most Popular