జూబిలెంట్‌ ఇండస్ట్రీస్‌కు క్యూ3 షాక్

జూబిలెంట్‌ ఇండస్ట్రీస్‌కు క్యూ3 షాక్

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో జూబిలెంట్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం పతనమైంది. రూ. 256 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 253 వరకూ జారింది.
ఫలితాలు వీక్‌
క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో జూబిలెంట్‌ ఇండస్ట్రీస్‌ రూ. 2.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ3లో రూ. 5.6 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 5 శాతం పెరిగి రూ. 119 కోట్లను తాకాయి. నిర్వహణ లాభం 6 శాతం పుంజుకుని రూ. 5 కోట్లను అధిగమించింది.Most Popular