మార్కెట్లు- ఒడిదొడుకుల ఓపెనింగ్‌!

మార్కెట్లు- ఒడిదొడుకుల ఓపెనింగ్‌!

వరుసగా రెండో రోజులు రేసు గుర్రాల్లా పరుగు తీసిన దేశీ స్టాక్ ఇండెక్సులు ఒడిదొడులకుతో ప్రారంభమయ్యాయి. స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 45 పాయింట్లు పెరిగి 35,305కు చేరగా.. నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,820 వద్ద కదులుతోంది. గురువారం అమెరికా మార్కెట్లు సైతం రికార్డు గరిష్టాల నుంచి ఊగిసలాటకు లోనై చివరికి నష్టాలతో ముగిశాయి. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
మెటల్‌, ఐటీ వీక్‌
ఎన్‌ఎస్ఈలో మెటల్‌, ఐటీ రంగాలు 0.5 శాతం స్థాయిలో బలహీనపడగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐబీహౌసింగ్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం 2.4-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. మరోపక్క అల్ట్రాటెక్‌, జీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ, పవర్‌గ్రిడ్‌, వేదాంతా, గెయిల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ 1.4-0.6 శాతం మధ్య నీరసించాయి.Most Popular